తిరుమలలో 80, వేల భక్తులు ఉన్నా 8, గంటల్లో.దర్శనం
తిరుమలలో 80, వేల భక్తులు ఉన్నా 8, గంటల్లో.దర్శనం
తిరుమలలో 80, వేల భక్తులు ఉన్నా 8, గంటల్లో.దర్శనం


తిరుమల, 14 మే (హి.స.)

వేసవి సెలవుల కారణంగా తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోతోంది. కానీ, గతంలోలా కిలోమీటర్ల మేర క్యూలైన్లు లేవు. కారణం.. తితిదేకు అందిన ‘ఆధునిక సాంకేతికత’. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) కేంద్రంగా సాగుతున్న పర్యవేక్షణతో శ్రీవారి దర్శన వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గతంలో 80 వేలమంది భక్తులు ఉన్నప్పుడు సర్వదర్శనానికి కనీసం 18-24 గంటల సమయం పట్టేది. ఇప్పుడు అదే సంఖ్యలో భక్తులున్నా 8 గంటల్లోనే పూర్తవుతోంది. ఈ నెల 2న 91,005 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారందరికీ 12 గంటల్లోనే దర్శనం కల్పించారు. దాదాపు 65% మంది భక్తులు క్యూలైన్లోకి ప్రవేశించిన 3-4 గంటల్లోనే దర్శనం పూర్తిచేసుకుని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దర్శనం త్వరగా పూర్తవడంతో భక్తులు వెంటనే గదులు ఖాళీచేస్తున్నారు. దీంతో కొత్తగా వచ్చే భక్తులకు గదుల లభ్యత పెరిగింది. అన్నప్రసాదం, విద్యుత్, తాగునీరు వంటి వనరుల వినియోగంపై భారం తగ్గింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande