
ఏలూరు జిల్లా, 14 మే (హి.స.)
ముసునూరు మండలం చింతలవల్లి వైన్ షాపు వద్ద దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఘర్షణకు దిగారు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదనే కారణంగా ఓ వ్యక్తిపై మరో నాగరాజు అనే వ్యక్తి దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. గంగయ్య, నాగరాజు కలిసి చింతలవల్లి వైన్ షాపుకు వచ్చారు. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. మరోసారి మద్యం సేవించేందుకు వంద రూపాయలు ఇవ్వాలని గంగయ్యను నాగరాజు అడిగాడు. ఇందుకు గంగయ్య ఒప్పుకోలేదు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఇరువురు ఘర్షణకు దిగారు.
వంద రూపాయల కోసం గంగయ్య తలపై నాగరాజు రాయితో దాడి చేశాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గంగయ్యను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గంగయ్య మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ