రక్షణ గోడను ఢీ కొట్టి ప్రైవేట్ బస్సు బోల్తా ..పలువురికి గాయాలు
రక్షణ గోడను ఢీ కొట్టి ప్రైవేట్ బస్సు బోల్తా
రక్షణ గోడను ఢీ కొట్టి ప్రైవేట్ బస్సు బోల్తా ..పలువురికి గాయాలు


తడ, 14 మే (హి.స.)

తిరుపతి జిల్లా తడ శివాలయం సమీపంలో జాతీయ రహదారి రక్షణ గోడను ఢీకొని ప్రైవేటు బస్సు బోల్తా పడింది. శ్రీసిటీకి కార్మికులు, శిక్షణ విద్యార్థులతో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దొరవారిసత్రం నుంచి బస్సు శ్రీసిటీలోని ఓ పరిశ్రమకు బయలుదేరింది. సూళ్లూరుపేట, కొండూరు వద్ద పలువురు బస్సెక్కారు. దాదాపు 30 మంది వరకు అందులో ప్రయాణిస్తున్నారు. చీరాల ఇంజినీరింగ్ కాలేజీ, ఆత్మకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన డిప్లొమా విద్యార్థులు టీవీఎస్ పరిశ్రమలో ఇంటర్న్షిప్ కోసం అదే బస్సులో ఎక్కారు. ఈ క్రమంలో జిల్లా తడ శివాలయం సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కృష్ణతేజ, రక్షితశ్రీ, మనోజ్, హర్షద్, అఖిల తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన చికిత్స కోసం రక్షితశ్రీని సూళ్లూరుపేటకు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande