580 మార్కులు సాధించిన విద్యార్థులకు ఉన్నత ఉచిత విద్య
580 మార్కులు సాధించిన విద్యార్థులకు ఉన్నత ఉచిత విద్య
580 మార్కులు సాధించిన విద్యార్థులకు ఉన్నత ఉచిత విద్య


పిఠాపురం, 14 మే (హి.స.)

: పిఠాపురం నియోజకవర్గంలో పదో తరగతి పరీక్షల్లో 580కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సంకల్పించారు. ఈ మేరకు గుర్తించిన 31 మంది విద్యార్థులకు ఆయన భరోసానిచ్చారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లల ఆసక్తికి అనుగుణంగా కోర్సులు, కళాశాలల ఎంపికకు వెసులుబాటు కల్పిస్తామన్నారు. నియోజకవర్గానికి చెందిన విద్యార్థిని 598 మార్కులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కళాశాలల యాజమాన్యాలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపి 31 మందికి ఉచిత విద్య అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రవేశాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన విద్యాసంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో..తల్లిదండ్రులు లేని విద్యార్థులకు నెలకు రూ.5 వేల చొప్పున తన నెల జీతం నుంచి పవన్కల్యాణ్ అందిస్తున్నారు. వీరిలో ఏడుగురు విద్యార్థులు పదిలో ఉత్తమ మార్కులు సాధించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande