
అమరావతి, 14 మే (హి.స.)
ఉబర్ గ్లోబల్ లీడర్షిప్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేశ్)ను కలిశారు. ఉబర్ సీఈవో దారా ఖొస్రోషాహీ నేతృత్వంలోని బృందంతో జరిగిన చర్చల్లో సాంకేతికత, మొబిలిటీ, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిపై చర్చించారు. పట్టణ రవాణా వ్యవస్థ వంటి విస్తృతమైన అంశాలపై తమ మధ్య చర్చ జరిగిందని మంత్రి లోకేశ్ తెలిపారు. భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఇటువంటి ప్రపంచ స్థాయి నాయకులతో ఆలోచనలను పంచుకోవడం ఎప్పుడూ నూతన ఉత్తేజాన్నిస్తుందని ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ