
వరంగల్, 14 మే (హి.స.)
లంచం తీసుకుంటూ మండల రెవెన్యూ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. దుగ్గొండి మండలంలోని మధిర గ్రామానికి చెందిన ఎల్. రాజు తండ్రి నర్సయ్య మరణించడంతో వారసత్వ భూమి 27 గుంటల బదిలీ కోసం ఎమ్మార్వో కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారి సదరు వ్యక్తిని లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఎమ్మార్వో కార్యాలయంలో లంచం రూ. 10వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెవెన్యూ అధికారి రాంబాబును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలో కార్యాలయంలో పలు రికార్డులను సైతం ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నర్సంపేట డివిజన్ లోని రెవెన్యూ కార్యాలయాల్లో అలజడి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు