
ఆదోని 14 మే (హి.స.)
కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడాకారిణి నీలం బండారిని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అభినందించారు. గత నెలలో థాయిలాండ్లో జరిగిన ప్రపంచ మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో నీలం బండారి పాల్గొన్నారు. మహిళా విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి మూడు పతకాలు సాధించారు. దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకురావడం పట్ల గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి.. నీలం బండారిని శాలువాతో సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ