ప్రభుత్వమే జొన్న పంట కొనుగోలు చేసేలా కృషి చేస్తా : ఎమ్మెల్యే పాయల్ శంకర్
ప్రభుత్వమే జొన్న పంట కొనుగోలు చేసేలా కృషి చేస్తా : ఎమ్మెల్యే పాయల్ శంకర్
Mla


ఆదిలాబాద్, 14 మే (హి.స.)

ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన జొన్న పంటను పూర్తిగా నూటికి నూరు శాతం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం సాత్నాల మండలం కాన్ప మేడి గూడ రైతు వేదికలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇప్పటివరకు అనేక కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి జొన్న పంట కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతుల్లో ఒక ఆత్రుత ఉందని, ఎక్కడ ప్రభుత్వం జొన్న పంటను కొనుగోలు చేయదేమో ఆందోళన కారణంగా మార్కెట్ యార్డ్ లలో రద్దీ ఏర్పడి గందరగోళం నెలకొందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా ఆలోచిస్తున్నామని తెలిపారు. జొన్న పంట కోటను పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande