సింగరేణి కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత.. మంత్రి వివేక్
సింగరేణి కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత.. మంత్రి వివేక్
Minister


పెద్దపల్లి, 14 మే (హి.స.) సింగరేణి ఆధ్వర్యంలోని మందమర్రి కేకే-5 గనిని రాష్ట్ర కార్మిక,

గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ గురువారం సందర్శించారు. మందమర్రి జీఎం రాధాకృష్ణ, తహసీల్దార్ సతీష్ కుమార్, ఏసీపీ కిరణ్ కుమార్లతో కలిసి మంత్రి ప్రత్యేక యూనిఫాం, తలకు టారైట్ ధరించి మ్యాన్వే ద్వారా బొగ్గు గనిలోకి దిగారు. గనిలో కార్మికులు పనిచేస్తున్న ప్రాంతాలను పరిశీలించి వారి పని పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. గనుల్లో తరచూ సేఫ్టీ సమావేశాలు నిర్వహించి, భద్రతా చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని తెలిపారు. కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు, సామాగ్రి సమకూర్చి వారి ప్రాణాలకు పూర్తి భద్రత కల్పించాలని ఆదేశించారు. గని పైకప్పుల పరిస్థితిని పరిశీలించిన మంత్రి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గని గడువు కాలానికి సంబంధించిన వివరాలను సేఫ్టీ అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, సింగరేణి కార్మికులతో తమ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. సింగరేణి సంస్థకు రూ.400 కోట్ల నిధులు తీసుకువచ్చి లక్ష ఉద్యోగాలను కాపాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని గుర్తుచేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కోల్ బ్లాక్ టెండర్లలో సింగరేణి సంస్థ పాల్గొనేలా చర్యలు తీసుకుంటోందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande