
హైదరాబాద్, 14 మే (హి.స.)
మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్
జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధి కౌకూర్ లో జరిగిన నేపాలీ మమత గ్యాంగ్ ను 48 గంటల్లో పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 11న రాత్రి రిటైర్డ్ ప్రొఫెసర్లు మురళీ మోహన్(75), విజయలక్ష్మీ (68)లను వారింట్లో బంధించి దాదాపు కోటికి పైగా బంగారం, వెండి ఆభరణాలు, నగదుతో పారిపోయిన విషయం తెలిసిందే. రిటెర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో పని మనుషులుగా చేరిన మమత గ్యాంగ్ మొత్తం రెక్కీ చేసుకుని పంజా విసిరారు. ఈ ముఠా రాబరీ చేసిన తర్వాత నేరుగా ఉత్తర్ ప్రదేశ్ కు పారిపోయారు. అక్కడి నుంచి కొన్ని అడుగులు వేస్తే నేపాల్ దేశంలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో మల్కాజిగిరి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉత్తర్ ప్రదేశ్ కోర్టులో హాజరుపర్చిన తర్వాత వారిని హైదరాబాద్ కు తీసుకువచ్చి మీడియా ముందు ప్రవేశపెడతారని సమాచారం.
ఈ సంఘటన చోటు చేసుకున్న తర్వాత పోలీసు కమిషనర్ సుమతి నిరంతరం అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ దాదాపు 10 ప్రత్యేక టీంలను రంగంలోకి దింపి నేపాలీ మమత గ్యాంగ్ ఆటను కట్టించింది. కొద్దిగా ఆలస్యమైనా ఈ ముఠా నేపాల్ లోకి ఎంట్రీ ఇచ్చేవారని, పట్టుకోవడం అలా జరిగి ఉంటే వారిని అసాధ్యమయ్యేదని అధికారులు అంటున్నారు. అన్ని విభాగాల పోలీసులు సమన్వయంతో పని చేయడంతో ముఠా అరెస్టు తో పాటు రాబరీ సోత్తు పూర్తిగా రికవరీ అయినట్లు తెలుస్తోంది. ముఠా అదుపు విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించడం లేదు. త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..