ధర్మవరం లో రేపు మంత్రి సత్య కుమార్ పర్యటన వివరాలు
ధర్మవరం లో రేపు మంత్రి సత్య కుమార్ పర్యటన వివరాలు
సత్య కుమార్


ధర్మవరం , 14 మే (హి.స.)

ఏపీ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖామంత్రి వర్యులు సత్య కుమార్ యాదవ్ రేపు, అనగా [15-04- 2026 తేదీ], ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

రేపు, ఉదయం 10 గంటలకు పుట్టపర్తిలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క ఎయిర్క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ & ఫ్లైట్ టెస్ట్ సెంటర్కు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తారు. అనంతరం, సాయంత్రం 5 గంటలకు ధర్మవరం పట్టణంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద నిర్మించిన నూతన గృహాలను ప్రారంభిస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande