స్వచ్ఛతకు సహకరించకపోతే జరిమానాలు, ట్రేడ్ లైసెన్స్ రద్దు ….
స్వచ్ఛతకు సహకరించకపోతే జరిమానాలు, ట్రేడ్ లైసెన్స్ రద్దు ….
penalties-for-non-compliance-with-cleanliness-include-cancellation-of-trade-license


కర్నూలు , 14 మే (హి.స.)కర్నూలు నగరంలో ఉన్న వాణిజ్య దుకాణాల వద్ద తప్పనిసరిగా నిర్వాహకులు డస్ట్బిన్ ఏర్పాటు చేసుకోవాలని, స్వచ్ఛతకు సహకరించకపోతే జరిమాన విధింపు, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు.

ఈ రోజు ఉదయం 2వ శానిటేషన్ డివిజన్లో మస్టర్ తనిఖీ నిర్వహించారు. కుమ్మరి గేరి, గడియారం ఆసుపత్రి, పెద్ద మార్కెట్, జమ్మిచెట్టు, జొహరపురం, గాంధీనగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

పలు దుకాణాల వద్ద డస్ట్బిన్లు లేకపోవడం, ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా ఉండటంపై కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పర్యవేక్షక సిబ్బంది పరిశుభ్రతపై మరింత పట్టు సాధించాలని, ప్రతి దుకాణం వద్ద తప్పనిసరిగా డస్ట్బిన్ ఏర్పాటు చేసి, 100 శాతం చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్ల వద్ద ఏర్పాటు చేసిన ట్రాక్టర్ ట్రాలీలను వ్యాపారస్తులు సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడాలని సూచించారు. అలాగే వినాయక ఘాట్ వద్ద కేసి కెనాల్ను కమిషనర్ పరిశీలించారు. గ్యాంగ్ వర్క్ పెట్టి, శుభ్రం చేయించాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande