హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మంటలు
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మంటలు
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మంటలు


తిరుపతి, 15 మే (హి.స.)ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం భీమవరం అడ్డరోడ్డు వద్ద ఎన్హెచ్-16పై శుక్రవారం ఉదయం భారీ ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కావేరీ ట్రావెల్స్కు చెందిన ప్రైవేటు బస్సులో అకస్మాత్తుగా ఇంజన్ భాగం నుంచి పొగలు రావడంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు.

బస్సును వెంటనే రోడ్డుపక్కకు ఆపి, అందులో ఉన్న 36 మంది ప్రయాణికులను క్షేమంగా దించేశారు. కొద్ది సేపటికే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. ఈ ఘటనతో ఎన్హెచ్-16పై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande