
పుట్టపర్తి,, 15 మే (హి.స.) శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి నారా లోకేశ్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈరోజు(శుక్రవారం) ఉదయం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని మంత్రి సందర్శించారు.
ప్రశాంతి నిలయంలో లోకేశ్కు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం సాయి కుల్వంత్ మందిరంలోని శ్రీ భగవాన్ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ స్టేట్ మీడియా కోఆర్డినేట్ రాష్ట్ర కార్యదర్శి బి.వి రాముడు తదితరులు పాల్గొన్నారు.
నేడు ఏఎంసీఏకు శంకుస్థాపన
పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాప్ట్(ఏఎంసీఏ) తయారీ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు. ఏఎంసీఏ ఇంటిగ్రేషన్, ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్, ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ, ఇతర రక్షణ రంగ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. రూ.15,803 కోట్లతో ఏఎమ్సీఏ(AMCA) ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుంది. దీంతో 7,500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV