మార్కాపురం అర్థవీడు. మండలం నాగులవరంలో గ్యాస్ పేలి గృహోపకరణాలు దగ్ధం
మార్కాపురం అర్థవీడు. మండలం నాగులవరంలో గ్యాస్ పేలి గృహోపకరణాలు దగ్ధం
మార్కాపురం అర్థవీడు. మండలం నాగులవరంలో  గ్యాస్ పేలి గృహోపకరణాలు దగ్ధం

అమరావతి, 02 మే (హి.స.)

అర్ధవీడు: గ్యాస్ సిలిండర్ పేలడంతో గృహోపకరణాలు దగ్ధమైన సంఘటన మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం నాగులవరంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన తోట శ్రీనివాసులు పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాడు. తెల్లవారుజామున వంట చేసుకునే క్రమంలో గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. దీంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని గృహోపకరణాలు, రూ.2 లక్షల నగదు, విలువైన బంగారు ఆభరణాలు, దుస్తులతో సహా మొత్తం కాలిపోయాయి. సుమారు రూ.7 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. సమాచారం అందుకున్న కంభం అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande