రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లే: బండి సంజయ్
ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్కు ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివని కేంద్రం హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు.
bandi Sanjay kumar


కరీంనగర్, 04 మే (హి.స.)ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్కు ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివని కేంద్రం హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లోనూ మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లోని పీఎంజే జ్యువెల్లరీ దుకాణంలో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాల్సింది పోయి.. ఈ ఘటనను రాజకీయ కోణంలో చూస్తున్నారని విమర్శించారు. దుకాణం యాజమాన్యంతో మాట్లాడానని, బాధితులకు అండగా నిలవాలని కోరానని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande