తిరుపతి.లోని అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్యుల 618 వ జయంతి ఉత్సవాలు
తిరుపతి.లోని అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్యుల 618 వ జయంతి ఉత్సవాలు
తిరుపతి.లోని అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్యుల 618 వ జయంతి ఉత్సవాలు

అమరావతి, 02 మే (హి.స.)

తిరుపతి (తితిదే): శ్రీ వేంకటేశ్వర స్వామివారి పరమభక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి ఆలపించిన సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం భక్తులను భక్తిరసంలో ముంచెత్తింది. ‘బ్రహ్మకడిగిన పాదము…’, ‘కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు…’, ‘నారాయణ తే నమో నమో…’, ‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన…’, ‘హరి అవతారమితడు…’ వంటి కీర్తనలు ఆలపించగా సభా వేదిక అంతా ఆధ్యాత్మిక సౌరభంతో నిండిపోయింది. అనంతరం హారతి, మహానివేదనం నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande