రోడ్డు పక్కన వాహనాలను నిలపకండి, ప్రాణాలు తీయకండి.. ఎంపీ ఈటల
రోడ్డు పక్కన వాహనాలను నిలపకండి, ప్రాణాలు తీయకండి.. ఎంపీ ఈటల
Mp


హైదరాబాద్, 02 మే (హి.స.)

రోడ్డు పక్కన వాహనాలను నిలపకండి, ప్రాణాలు తీయకండి.. ఎంపీ ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించిన ఘటనపై ఆయన స్పందించారు. అతివేగం, నిర్లక్ష్యం, నిద్రమత్తు కారణం ఏదైనా రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి, రోడ్డున పడేస్తున్నాయని తెలిపారు. వేగం కన్నా ప్రాణం మిన్న లాంటి ఎన్ని నినాదాలు రాసినా అవి నినాదాలకే పరిమితం అవుతున్నాయని పేర్కొన్నారు.

'డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర మీకోసం మీ కుటుంబం ఎదురుచూస్తుందని గుర్తుపెట్టుకోండి.. ముఖ్యంగా రోడ్డు పక్కన వాహనాలు నిలుపుతున్నారు.. మీ నిర్లక్ష్యం వల్ల ఇతరుల ప్రాణాలు తీస్తున్నారని మర్చిపోకండి.. ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు పక్కన వాహనాలు నిలపకండి.. అలా నిలిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నాను' అని వెల్లడించారు. శంషాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మరణం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande