
రంగారెడ్డి, 02 మే (హి.స.)
యోగ సర్వరోగ నివారిణి అని ప్రతి
ఒక్కరూ పాటించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హ శాంతి వనంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్హ శాంతి వనాని సందర్శించారు. ఆయనకు హార్ట్ ఫుల్ నెస్ దాజి స్వాగతం పలికారు. అనంతరం కిషన్ రెడ్డి యోగాలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో మారుతున్న జీవనశైలిలో భాగంగా ప్రతి ఒక్కరు యోగా తప్పకుండా పాటించాలని యోగ వల్ల సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎంపీ డీకే అరుణ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి.శంకర్ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..