
కర్నూలు, 02 మే (హి.స.)జిల్లా వ్యాప్తంగా శనివారం తెల్లవారుజాము నుంచి ఆయా పోలీసు స్టేషన్లకు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు.
మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా కర్నూలు నగరంలో పోలీసులు శనివారం ఆపరేషన్ వజ్రప్రహార్ నిర్వహించారు.
అపరేషన్ వజ్ర పహార్లో భాగంగా ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా హాట్స్పాట్లు, అనుమానితులు, రౌడీషీటర్లు, పాత నేరస్థుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర ్భంగా పలువురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు.
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోహరాపురం, ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ ప్రాంతాల్లో విస్తృత సోదాలు చేపట్టారు. గంజాయి, ఇతర నేరాల్లో పట్టుబడిన నిందితుల ఇళ్లు, అద్దె గృహాలు, ఖాళీ భవనాల్లో తనిఖీలు నిర్వహించి, 10 మంది రౌడీ షీటర్లను, ఇద్దరు సస్పెక్ట్ షీటర్లను విచారించారు.
ఈ సందర్భంగా అనుమానితులు, రౌడీషీటర్ల ఇళ్లు సోదాలు చేశారు. అలాగే గంజాయి, మాదకద్రవ్యాలను వినియోగించమని, వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆయా ప్రాంతాల్లో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతలను కాపాడటమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఎల్లవేళలా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV