
గుంతకల్లు(అనంతపురం), 02 మే (హి.స.): తిరుపతి-పండర్పూర్-తిరుపతి (వయా గుత్తి) ప్రత్యేక వీక్లీ రైలు (07012/32)ను రెగ్యులర్ రైలుగా మార్పు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తిరుపతి-పండర్పూర్ రెగ్యులర్ రైలు (17437)ను ఈ నెల 16 నుంచి, దీని తిరుగు ప్రయాణపు రైలు (17438)ను ఈ నెల 17వ తేదీ నుంచి రెగ్యులర్ వీక్లీగా మారుస్తున్నట్లు తెలిపారు. ఈ రైలు తిరుపతి, రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, డోన్, గద్వాల, వనపర్తి రోడ్, మహబూబ్నగరర్, షాద్నగర్, కాచిగూడ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, ఉదయగిరి, లాతూర్ రోడ్డు, ధారాశివ్, బర్సి టౌన్, కురుద్వాడి, మోబింద్ స్టేషన్ల మీదుగా పండర్పూర్కు చేరుకుంటుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV