అధ్వానంగా రోడ్డు : డొనేకల్లు-ఆర్ కొట్టాల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు
అధ్వానంగా రోడ్డు : డొనేకల్లు-ఆర్ కొట్టాల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు
Ananthapuram » Bad road


అనంతపురం, 03 మే (హి.స.) దాదాపు ఇరవై ఏళ్లుగా రోడ్డు వేయకుండా ఉండడంతో విడపనకల్లు మండలంలోని డొనేకల్లు-ఆర్ కొట్టాల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మరమ్మతులపై అధికా రులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆయా గ్రామాల ప్రజలు బహిరం గంగానే విమర్శిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో డొనేకల్లు నుంచి 1.5కిలో మీటర్ల దూరం బీటీ రోడ్డు(తారురోడ్డు) వేశారు. అయితే వేసిన ఆర్నెట్లకే ఎక్కడికక్కడ పగిలి పోయి రోడ్డు శిథిలమైంది. అక్కడి నుంచి ఆర్ కొట్టాల వరకూ కంకర తేలిన రోడ్డుపైనే ప్రత్యక్ష నరకం చూస్తూ ప్రయాణం చేస్తున్నామని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు మండి పడుతున్నారు. గతంలో ఆర్ కొట్టాల నుంచి 1.5 కిలోమీటర్ల దూరం వ రకు ఉపాధి హామీ పథకం కింద రూ. 35లక్షలతో బీటీ రోడ్డు వేయాలని నిధుల కేటాయించారు. నిదులు రావటం ఆలస్యం కావడంతో మండల స్థాయి అధికారి ఒకరు కాంట్రాక్టర్తో చేతులు కలిపి 6ఎంఎం కంకర మాత్రమే వేయించి 1.5కిలో మీటర్లు తారు వేశారని, అందుకు రూ. 35లక్షలు డ్రా చేశారనే విమర్శలు ఉన్నాయి. రికార్డుల్లో మాత్రమే తారు రోడ్డు ఉంది కానీ అక్కడ ఎక్కడా తారు రోడ్డు కనిపించలేదని సామాజి క తనిఖీలో తేల్చారు.

ఈ విషయమై జిల్లా అధికారులు రోడ్డును పరిశీలించి ఎంత మేరకు పనులు జరాగాయి అని అంచనా వేసిబా ధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఇంత వరకూ ఎవరి పైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ రికార్డుల్లో మాత్రం ఇక్కడ తారురోడ్డు వేసినట్లు ఉంది. రోడ్డు లేకపోవ డంతో రైతులు పంటల కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ రో డ్డుపై వెళ్లిన ఎద్దులకు కంకర రాళ్లు గుచ్చుకుని కిందపడి కాళ్లు విరిగిన సంఘటనలున్నాయి. ట్రాక్టర్లు బోల్తా పడి ఎరువుల సంచులు నీళ్లు పాలు అవడం, ద్వి చక్ర వాహనాలు కిందపడి వాహన దారుల కాళ్లు విరిగి ఆసుపత్రి పాలు అవడం వంటి సంఘనలూ ఉన్నాయి. ఇప్పటి కైనా అధికారులు, ప్రజా ప్రతినిథులు స్పందించి డొనేకల్లు-ఆర్ కొట్టాల రోడ్డు వేయాలని ఆయా గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande