
హైదరాబాద్, 03 మే (హి.స.)
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్
పరిధిలో శనివారం రాత్రి 65 ఇన్స్పెక్టర్ లను బదిలీ చేస్తూ వెలువడిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారింది. ఈ ఉత్తర్వులను హోల్డ్ లో పెడుతున్నట్లు స్వయంగా సీపీ ఆదివారం మౌఖికంగా చెప్పడంతో ఇన్స్పెక్టర్ లు గందరగోళంలో పడ్డారు.
ఉత్తర్వులు ఇచ్చిన పోలీస్ బాస్ ఆ పోస్టింగ్ లలో ఎవరు బాధ్యతలు తీసుకోవద్దని చెప్పడంతో ఈ బదిలీల పై రాజకీయ ఒత్తిడి ఉందని పోలీస్ వర్గాలు అంటున్నాయి. పొలిటికల్ దెబ్బకు ఒకసారిగా బదిలీలు నిలిచిపోయాయని తెలుస్తోంది. మరో వైపు ఈ బదిలీలు సక్రమంగా జరగలేదని ఆరోపణలు ఉన్నాయి. జోన్ స్థాయి అధికారులకు సన్నిహితంగా ఉండి వారు చెప్పినట్లు పనిచేసిన వారికి, నచ్చిన వారికి కీలక పోస్టింగ్ లు దక్కాయనే విమర్శలు ఉన్నాయి. ఇక రాజకీయ పుష్కలంగా అండదండలు ఉన్న వారికీ సైబరాబాద్ లోనే ప్రధాన పోస్టింగ్ లు దక్కాయని పోలీస్ వర్గాలు గుసగుస లాడుతున్నాయి. ఏదేమైనా పనిచేసే వారిని కాకుండా పైరవికారులకు పెద్ద పీట వేశారని పోలీస్ వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..