
హైదరాబాద్, 03 మే (హి.స.)
సూపర్ సండే నేపథ్యంలో ఐపీఎల్2026లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ సీజన్ లో అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించేందుకు మరోసారి రెడీ అయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటలకు కేకేఆర్ తో హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు.
ఇందులో హైదరాబాద్ గెలిస్తే.. ప్లే ఆఫ్స్ కు మరింత చేరువ కానుంది. అటు ఇవాళ రాత్రి 7:30 గంటలకు గుజరాత్ టైటాన్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. గత మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ టేబుల్ టాపర్ గా కొనసాగుతున్న పంజాబ్, గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధిస్తే 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇవాళ జరిగే రెండు మ్యాచ్ లను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు