
హైదరాబాద్, 03 మే (హి.స.)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యంత ఓల్డ్ అండ్ క్రేజ్ ఉన్న జట్లలో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ (RR) యాజమాన్యం మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎన్. మిట్టల్ కుటుంబంతో పాటు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా సంయుక్తంగా ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. మనోజ్ బడాలే నేతృత్వంలోని కన్సార్టియం నుంచి ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేస్తున్నట్లు మిట్టల్ కుటుంబం ఆదివారం ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది. ఈ డీల్ విలువ అక్షరాలా 1.65 బిలియన్ యూఎస్ డాలర్లు (సుమారు రూ. 15,600 కోట్లు) కావడం విశేషం. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ డీల్స్లో ఒకటిగా నిలవనుంది.
నిజానికి రాజస్థాన్ రాయల్స్ను కొనుగోలు చేయడానికి అమెరికా వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం ముందుకొచ్చింది. వీరు 1.63 బిలియన్ డాలర్లకు బిడ్ దాఖలు చేశారు. అయితే, నిధుల సేకరణలో (Funding issues) సమస్యలు తలెత్తడం, డ్యూ డిలిజెన్స్ (due diligence) ప్రక్రియలో పలు సమస్యల కారణంగా ఈ ఒప్పందం కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో కల్ సోమానీ రేసు నుండి తప్పుకోవడంతో మిట్టల్ కుటుంబం రంగంలోకి దిగింది. వీరికి తోడుగా అదర్ పూనావాలా కూడా భాగస్వామిగా మారి ఈ టీమ్ ను తమ సొంతం చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..