ప్రకాశ్రాజ్ పొలిటికల్ జోకర్.. కిరణ్ రాయల్ షాకింగ్ కామెంట్స్
ప్రకాశ్రాజ్ పొలిటికల్ జోకర్.. కిరణ్ రాయల్ షాకింగ్ కామెంట్స్
Jana Sena Leader Kiran Royal Slams Prakash Raj in


తిరుపతి, 03 మే (హి.స.), : ప్రముఖ సినీనటుడు ప్రకాశ్రాజ్పై (PrakashRaj) జనసేన నేత కిరణ్ రాయల్ (Jana Sena Leader Kiran Royal) షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రకాశ్రాజ్ ఓ పొలిటికల్ జోకర్ అని ఎద్దేవా చేశారు. ప్రకాశ్రాజ్ ఒక అపరిచితుడని… ఉత్తమమైన మనిషి కాదని… ఆయన ఉత్తమ నటుడు మాత్రమేనని చెప్పుకొచ్చారు.

ఈరోజు (ఆదివారం) తిరుపతి వేదికగా కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడారు. ప్రకాశ్రాజ్.. ఫిల్మ్ఛాంబర్ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ కాళ్లు పట్టుకున్నారని సెటైర్లు గుప్పించారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రకాశ్రాజ్ ఒక మాటనైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. అలా ఆయన మాట్లాడితే దైవభక్తి ఉందని.. తాము అప్పుడు ఆయన మాటలను ఒప్పుకుంటామని పేర్కొన్నారు.

వైసీపీ హయాంలో జరిగిన పాపాలపై మాట్లాడే పరిస్థితి తమకు మళ్లీ మళ్లీ వస్తోందని అన్నారు. టీటీడీ నెయ్యి కల్తీ విషయం ప్రపంచాన్ని కుదిపేస్తోందని చెప్పుకొచ్చారు. కల్తీకి పాల్పడిన దొంగలు దొరల్లా తిరుగుతున్నారని విమర్శించారు. రసాయనాలతో చేసిన నెయ్యి అని సీబీఐ సిట్ తేల్చిందని చెప్పుకొచ్చారు. అసలు దొంగ ధర్మరెడ్డినేనని… ఈవో సింఘాల్, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిని మేనేజ్ చేశారని విమర్శించారు. ఈ దొంగలను వెంటనే ప్రభుత్వం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చీటింగ్, కల్తీ ఆహారం, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు.. వారి వ్యవహార శైలిపై కేసు నమోదు చేయాలని కోరారు. ధర్మారెడ్డి చేసిన తప్పులకు శిక్ష అనుభవించారని… ఇకనైనా ధర్మారెడ్డి మారాలని సూచించారు. అపచారం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటేనే భయం వల్ల వేరొకరు ఇలాంటి తప్పులు చేయరని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande