సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చే బాధ్యత వారిదే..ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చే బాధ్యత వారిదేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు.
Revanth reddy


హైదరాబాద్, 03 మే (హి.స.)ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్లేనని, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చే బాధ్యత వారిదేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఎంపీ వేం నరేందర్రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, యెన్నం శ్రీనివాస్రెడ్డి, విజయరమణరావు, రామచంద్రునాయక్, వేముల వీరేశం, అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లతో సీఎం సమావేశమై చర్చించారు. వేసవి నేపథ్యంలో నియోజకవర్గాల్లో తాగు, సాగునీటి అవసరాలకు తీసుకోవల్సిన చర్యలు, ధాన్యం సేకరణలో పురోగతి వివరాలను విప్లు సీఎంకు తెలిపారు. ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతోపాటు ఆయా సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. విప్లు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలన్నారు. ప్రభుత్వ విప్లతో సమన్వయం చేసుకునేందుకు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వారంలో ఒకరోజు విప్లకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande