
వర్ధన్నపేట, 03 మే (హి.స.)వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్రోడ్డు సమీపంలో ఇసుక లేబర్ మెరుపు ధర్నాకు దిగారు. ప్రభుత్వ మొండివైఖరి వల్ల జీవనోపాధి కోల్పోతున్నామంటూ నిరసన చేపట్టారు. ఉపాధి మార్గం చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల ధర్నాతో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్ధన్నపేట, పర్వతగిరి, అయినవోలు మండలాల పోలీసులు అక్కడికి చేరుకొని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే నాగరాజు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ధర్నా విరమించే ప్రసక్తే లేదని ఇసుక కార్మికులు భీష్మించుకు కూర్చున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్