
అనంతపురం 03 మే (హి.స.)అనంతపురంలో ఓ పాఠశాల యజమాని విలేకరిపై దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. హనీట్రాప్ కేసులోని నిందితురాలితో సదరు యజమానికి సంబంధాలున్నాయని వార్త రాసినందుకు, విలేకరి ఇంటికి వెళ్లి దాడి చేయడమే కాకుండా బలవంతంగా కాళ్లు మొక్కించుకున్నట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. వార్తపై అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా వెళ్లాలని, భౌతిక దాడులు చేయడం దుర్మార్గమని వారు ఖండించారు
అనంతపురంలో ఓ పత్రికా విలేకరిపై విచక్షణారహితంగా దాడి చేసి, కాళ్లు విరగ్గొట్టిన మనీష నాయర్, మరికొందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు రూరల్ డీఎస్పీ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. సీనియర్ జర్నలిస్టులు రవి, లక్ష్మి నారాయణ, రామాంజనేయులు, ఫణి మాధవ్ మాట్లాడుతూ, ఈ ఘటన జర్నలిస్టుల భద్రతపై ఆందోళన కలిగిస్తోందని, వార్త తప్పైతే కోర్టుకు వెళ్లాలని, దాడి చేయడం నేరమని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV