ప్రజలకు అలర్ట్..నేడు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
కర్నూలు, 03 మే (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఓ వైపు ఎండలు దంచి కొడుతూనే, మరోవైపు ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా పడుతున్నాయి. ఇక ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు
rain


కర్నూలు, 03 మే (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఓ వైపు ఎండలు దంచి కొడుతూనే, మరోవైపు ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా పడుతున్నాయి. ఇక ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో రాయల సీమ, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో నేడు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు APSDMA ఎండీ ప్రఖర్ జైన్.

ఈ తరుణంలో రైతులు... వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. అటు నేడు ఎండ తీవ్రతతో పాటుగా కర్నూలు జిల్లా ఆదోని మండలాల్లో తీవ్ర,మరో 124 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ప్రఖర్ జైన్ ఉందన్నారు. ఎండ తీవ్రత,ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande