మందుపాతరకు నలుగురు పోలీసులు బలి
మందుపాతరకు నలుగురు పోలీసులు బలి
Encounter between Naxalites in West Singhbhum


భద్రాచలం, 03 మే (హి.స.)

భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి నలుగురు జిల్లా రిజర్వ్ దళం(డీఆర్జీ) పోలీసులు మరణించారు. మృతుల్లో ముగ్గురు జవాన్లు, ఒక ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్-నారాయణ్పూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగింది. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీఆర్జీ బృందాలు చోటేబేథీ పోలీస్స్టేషన్ ఫరిధిలోని అడవుల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ క్రమంలో ఏరియా డామినేషన్ నిర్వహిస్తున్న మరో బృందం మందుపాతరను గుర్తించి, దానిని తొలగించే ప్రయత్నం చేసింది. దీంతో అది ఒక్కసారిగా భారీ విస్ఫోటనం చెంది నలుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలిస్తుండగా ముగ్గురు దారి మధ్యలో చనిపోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande