పార్టీలకు, కులాలకు అతీతంగా అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి పొంగులేటి
పార్టీలకు, కులాలకు అతీతంగా అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి


ఖమ్మం, 03 మే (హి.స.) ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రెండో విడత ప్రజాదర్బార్ కార్యక్రమం ఆదివారం కూసుమంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలిసి మంత్రి పొంగులేటి. శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కాగా 15 గ్రామ పంచాయతీల ప్రజలు ఈ కార్యక్రమంలో తమ దరఖాస్తులను నేరుగా మంత్రికి అందజేశారు. కాగా భారీ స్థాయిలో ప్రజా దర్బార్ కు ప్రజలు విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో ప్రతి పేదవాడికి భరోసా అందిస్తూ ముందుకు సాగుతుందని, మూడవ సంవత్సరంలో ప్రజల వద్దకే అధికారులను పంపిస్తూ 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా మండలానికి మూడు క్లస్టర్లుగా విభజించి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని మంత్రి పొంగులేటి అన్నారు. పార్టీలకు కుల మతాలకతీతంగా ప్రజల ప్రతి సమస్య పరిష్కరిస్తామని, భూభారతి ద్వారా ప్రతి భూ సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. గత మూడు ప్రజాదర్బార్ కార్యక్రమాల్లో అధిక దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్లు కావాలని ప్రజలు కోరుతున్నారని, గత ప్రభుత్వం ఇండ్లు ఇవ్వకపోవడం వలనే ఇప్పుడు ఇండ్లకు డిమాండ్ ఏర్పడిందని, ఎటువంటి లంచాలు లేకుండా ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని, ఇస్తామని తెలిపారు.

పార్టీలకు, కులాలకు అతీతంగా అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. ప్రజాదర్బార్ కార్యక్రమంలో కేవలం దరఖాస్తులు తీసుకుని పక్కకు పడేయకుండా ప్రతి దరఖాస్తు ఆన్లైన్ చేసి భద్రపరిచి పరిష్కారం చూపిస్తామని అన్నారు.

పేదల పక్షపాతి గా ఈ ప్రభుత్వం పని చేస్తుందని, ఉచిత విద్యుత్, రైతులకు ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, రైతులు భరోసా, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇలా ప్రతి రంగంలో అభివృద్ధి చేస్తున్నామని, ప్రభుత్వ అభివృద్ధిని చూడలేక ప్రతిపక్షాలు కండ్లలో నిప్పులు పోసుకుంటున్నాయని వారు ప్రజలను మభ్య పెట్టడానికి కల్లబొల్లి కబుర్లు చెప్పి తప్పుదోవ పట్టించే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వారు మల్లి అధికారంలోకి రావాలన్న ఆశ కలగానే మిగులుతుందని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి చేసి చూపిస్తుందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande