
తిరుమల, 03 మే (హి.స.)తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ, తమిళనాడు మాజీ మంత్రి శేఖర్ బాబు, టీడీపీ పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వేర్వేరుగా ఆలయానికి విచ్చేసి స్వామివారిని సేవించారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం, రంగనాయక మండపంలో వేదపండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV