శ్రీవారి లడ్డూలో రసాయనాల నెయ్యి.. ఆ నలుగురిదే బాధ్యత: భానుప్రకాశ్ రెడ్డి
శ్రీవారి లడ్డూలో రసాయనాల నెయ్యి.. ఆ నలుగురిదే బాధ్యత: భానుప్రకాశ్ రెడ్డి
ttd-ghee-controversy-four-officials-held-responsib


తిరుపతి, 03 మే (హి.స.), తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి సరఫరా చేసిన రసాయనాల నెయ్యికి ఆ నలుగురిదే బాధ్యత అని పాలక మండలి సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. దినేశ్ కుమార్ ఏకసభ్య కమిషన్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు.

ఈ రోజు ఆదివారం తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో భానుప్రకాశ్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. అప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, వైవీ సుబ్బారెడ్డి, ఏవీ ధర్మారెడ్డితోపాటు భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర కీలకమని కమిషన్ తేల్చిందన్నారు. నిబంధనలు సడలింపు వలనే నెయ్యి కల్తీ జరిగిందని చెప్పారు. మే 6వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఈ నలుగురిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేస్తామని భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande