
గోనెగండ్ల, :, 04 మే (హి.స.)
గోనెగండ్ల ప్రభుత్వ వైద్యశాలలోని హాజరు దస్త్రంలో ముందస్తుగా సంతకం చేసిన బాగోతం బయటపడింది. 4వ తేదీన విధులకు హాజరైనట్లు 2వ తేదీ సాయంత్రమే మండల వైద్యాధికారిణి రంగరవళి రిజిస్టర్లో సంతకం చేసిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు కిందిస్థాయి ఉదోగులు 2, 3 తేదీల్లో సంతకాలు చేయకపోవడం గమనార్హం.
గోనెగండ్లలోనే గోనెగండ్ల, పెద్దనెలటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఆరేళ్లుగా పెద్దనెలటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పక్కా భవనం లేకపోవడంతో డాక్టర్లు వంతుల పద్ధతులు పాటిస్తున్నారు. విధుల నిర్వహణపై ప్రశ్నిస్తే ఆన్డ్యూటీ.. 104 వైద్య సేవలో ఉన్నట్లు సమాధానం చెబుతున్నారని జనం పేర్కొంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ