
అమరావతి, 04 మే (హి.స.)
ఎయిడెడ్ టీచర్లకు సీనియారిటీ జాబితా రూపొందించి, కౌన్సెలింగ్ ద్వారా ఒక్కరే టీచర్ ఉన్న పాఠశాలలకు బదిలీ చేయాలని ఏపీ టీచర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది. గిల్డ్ ప్రతినిధులు బి.చిట్టిబాబు, ఎల్.కె.చిన్నప్ప, ప్రభాకర్రెడ్డి ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 205 ఎయిడెడ్ పాఠశాలల్లో ఒక్కొక్కరు చొప్పున మాత్రమే టీచర్లు ఉన్నారని తెలిపారు. మరణించిన టీచర్ల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, భాషా టీచర్లకు పదోన్నతులు కల్పించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ