పెట్రోల్ బంకులలో నాణ్యమైన ఫ్యూయల్ అమ్మాలి : మంత్రి సీతక్క
నాణ్యమైన ఫ్యూయల్ అమ్మాలి : మంత్రి సీతక్క
మంత్రి సీతక్క


ములుగు, 04 మే (హి.స.)

పెట్రోల్ బంక్ యజమానులు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అమ్మకం చేసి వినియోగదారుల మన్ననలను పొందాలని రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క అన్నారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రం సమీపంలో ఫ్యూయల్ స్టేషన్ మంత్రి ఈ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ నాణ్యమైన ఫ్యూయల్ అమ్మకం చేస్తే వినియోగదారుల విశ్వాసాన్ని పొందడమే కాకుండా వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె జయపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి చక్రపు శ్రీనివాస్, వెంకటాపూర్ మాజీ ఎంపీపీ బుర్ర రజిత సమయ్య గౌడ్, ఫిల్లింగ్ స్టేషన్ యజమానులు తిరుమల్ రెడ్డి, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande