
మహబూబ్నగర్, 04 మే (హి.స.)
ఇకపై ప్రతి సోమవారం నిర్వహించే 'ప్రజావాణి' కార్యక్రమం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించనున్నట్టు మహబూబ్నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కి ఇది కొనసాగింపు అని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 4వ తేదీ సోమవారం మహబూబ్ నగర్ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించే 'ప్రజావాణి' కార్యక్రమంలో డివిజన్ స్థాయి ప్రజలు తమ సమస్యల ఫిర్యాదులను సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి ఆర్డీవో నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, డివిజినల్ పంచాయతీ అధికారి, డిఫ్యూటీ డీఎంహెచి, వ్యవసాయ సంచాలకులు, డిస్కౌం డీఈ లు, ఆర్ అండ్ బీ, ఆర్.డబ్ల్యూ.ఎస్, హౌసింగ్ డీఈఈ లు, సీడీపీఓలు, సహాయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, అభివృద్ధి అధికారులు డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని ఆమె ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..