
ఉరవకొండ, 04 మే (హి.స.) పాడి పరిశ్రమలో కీలకమైన పశుగ్రాసం కొరతతో పాడిరైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ కారణాలతో వరి పంట కోసేందుకు యంత్రాలు ఉపయోగిస్తు న్నారు. ఇందులో మమకూలీల కొరత ఒక కారణమైతే, ఖర్చులు పెరగ డంతో సాగుదారులు యంత్రాలపై ఆధారపడడం ఏటా పెరుగుతోంది. దీంతో స్థానికంగా పశుగ్రాసం కొరత ఏర్పడింది. వ్యాపారులు కణేకల్లు, బొమ్మనహాల్ మండలాల నుంచి వరి గడ్డిని కొనుగోలు చేసి ఉరవకొండలో అమ్ముతుంటారు. క్షేత్రస్థాయిలో గ్రాసం కొరత ఏర్పడ డంతో వరిగడ్డి ధరలు కూడా అమాంతంగా పెరిగాయి. ట్రాక్టర్ గడ్డి ధర రూ.10వేల వరకు పలుకుతోంది. ఐదు నెలల క్రితం రూ.6వేలు వరకు పలికిన ధర ఇప్పుడు ఏకంగా రూ.10వేలు అయింది. ధర అమాంతం గా పెరగడంతో పశుపోషణ భారంగా మారిందని పాడిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV