కుంకి ఏనుగులకు డీ ఎన్.ఏ పరీక్షలు
కుంకి ఏనుగులకు డీ ఎన్.ఏ పరీక్షలు
కుంకి ఏనుగులకు డీ ఎన్.ఏ పరీక్షలు


పలమనేరు, 06 మే (హి.స.)

చిత్తూరు జిల్లాలోని పలమనేరు కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు అధికారులు డీఎన్ఏ పరీక్షలు చేయించారు. ఏనుగుల సంరక్షణ, పరిరక్షణ, శాస్త్రీయ అధ్యయనాల నిమిత్తం రెండు రోజుల క్రితం రక్త నమూనాలను సేకరించి దేహ్రాదూన్ వైల్డ్లైఫ్ ఇనిస్టిట్యూట్కు పంపారు. పరీక్షల ఫలితాల తర్వాత వాటి వివరాలతో ఒక గుర్తింపు కార్డును ఏనుగుకు తగిలిస్తారు. అది ఆధార్ కార్డులా ఉపయోగపడుతుంది. ఈ వివరాలతో జన్యుపరమైన సమస్యలకు వైద్యంతో పాటు వాటి ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు. భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా సమగ్ర వివరాల కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చిత్తూరు డీఎఫ్వో సుబ్బరాజు తెలిపారు.

జయంత్, రంజన్, అభిమన్యు, కృష్ణ, దేవ, వినయ్ అనే ఆరు కుంకీలను కర్ణాటక నుంచి రప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇవన్నీ పలమనేరు క్యాంపులోనే ఉన్నాయి. వీటి ద్వారా అడవిలోని ఏనుగులు గ్రామాల మీదకు రాకుండా వాటిని మళ్లించడానికి శిక్షణ కూడా ఇచ్చారు. రెండుసార్లు ఏనుగులను మళ్లించే ప్రక్రియ విజయవంతంగా చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande