యువత నైపుణ్యాభివృద్ధితోనే తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యం : మంత్రి శ్రీధర్ బాబు
యువత నైపుణ్యాభివృద్ధితోనే తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యం : మంత్రి శ్రీధర్ బాబు
Minister


పెద్దపల్లి, 06 మే (హి.స.)

ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాల

కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. బుధవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి మంథని మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని తెలిపారు. కలెక్టర్ ద్వారా అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. రైతులు ఎవ్వరు ఆందోళన చెందవద్దని మంత్రి భరోసా కల్పించారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లారీలు, హమాలీల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరమైన మేర గన్నీ బ్యాగులు, టార్పాలిన్ అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతు సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట మంథని ఆర్డీఓ సురేష్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

టాస్క్ అడ్వాన్స్డ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలను పొందాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande