మోదీ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ
ప్రధాని మోదీ తర్వాత టార్గెట్ తెలంగాణ రాష్ట్రమేనని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు
Vishweshwar reddy


హైదరాబాద్, 07 మే (హి.స.)పశ్చిమబెంగాల్లో బీజేపీ విజయం సాధించిందని, ప్రధాని మోదీ తర్వాత టార్గెట్ తెలంగాణ రాష్ట్రమేనని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఈ నెల 10న తెలంగాణలో మోదీ పర్యటన నేపథ్యంలో గురువారం మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్లోని పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయభేరి మోగించిందని, ఇదే ఊపు తెలంగాణలోనూ కొనసాగనున్నదని చెప్పారు.10న పరేడ్గ్రౌండ్లో జరగనున్న మోదీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande