
మిర్యాలగూడ, 13 జూన్ (హి.స.)
మిర్యాలగూడలో అమృత్ 2.0
అండర్ గ్రౌండ్ డ్రైనేజ, వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణంలో పలు వార్డులలో జరుగుతున్న పనులను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ప్రజలకు తాగునీరు, మురుగునీటి సమస్యలు లేకుండా చేయడంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. పట్టణంలోని పలు వార్డుల్లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైడ్లైన్ పనులను వేగవంతంగా చేయాలని అన్నారు. మురుగునీటి పైపులు వేసేటప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమృత్ 2.0 పథకం ద్వారా కోట్లాది రూపాయల నిధులతో మురుగునీటి వ్యవస్థను, తాగునీటి సరఫరాను ఆధునీకరిస్తున్నామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు