ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్: మంత్రి తుమ్మల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్: మంత్రి తుమ్మల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్
Phone tapping


హైదరాబాద్, 13 జూన్ (హి.స.)

తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో శనివారం మరో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేస్తును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) అధికారులు.. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నివాసానికి వెళ్లి ఆయన స్టేట్మెంట్ను అధికారికంగా రికార్డు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఫోన్ అక్రమంగా ట్యాపింగ్కు గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 2023 ఎన్నికల వేళ ఖమ్మం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన తుమ్మల టార్గెట్గా అప్పట్లో కొందరు నిఘా అధికారులు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు విచారణలో ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అందించిన కీలక సమాచారం ఆధారంగా సిట్ అధికారులు శనివారం మంత్రి తుమ్మల ఇంట్లోనే ఆయన వాంగ్మూలాన్ని (స్టేట్మెంట్) నమోదు చేసుకున్నారు.

ఆ సమయంలో తన ఫోన్ కాల్స్ డేటా, లొకేషన్ల ట్రాకింగ్, ప్రైవేట్ సంభాషణలను ఎలా నిఘా పెట్టారనే కోణంలో అధికారులు మంత్రి నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. బాధితుడిగా మంత్రి తుమ్మల ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఆధారంగా కేసు విచారణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిట్ సిద్ధమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు జైలులో ఉండగా.. తాజాగా శనివారం మంత్రి తుమ్మల ఇంట్లో జరిగిన సిట్ అధికారుల విచారణతో ఈ కేసు దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande