
రాజన్న సిరిసిల్ల, 13 జూన్ (హి.స.)
కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీగా
తయారైంది.. డబ్బులు పెట్టి పదవులు తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేములవాడ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు.. కాంగ్రెస్ పార్టీలో పైసలు తీసుకొని అన్ని అమ్ముకుంటున్నరని చెప్పిండు. వాస్తవం అన్నారు.
ఆనాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిరూ.50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి అమ్ముకుంటురని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని అమ్ముకున్నడు కాబట్టే రాహుల్ గాంధీ కూడా ఏమీ చేయలేని అసక్తతలో ఉన్నడని కేటీఆర్ అన్నారు. మీనాక్షి నటరాజన్ ఆమె నిజాయితీగా ఉంటే రేవంత్ రెడ్డితో పాపం ఆమెకు ఏదో పంచాయతీ పడ్డది. గరీబోళ్ల ఇండ్లు కూలగొట్టకు ఇది మంచి పద్దతి కాదు... హైడ్రా, మూసీ పేరు మీద గరీబోళ్ల ఇండ్లను నాశనం చేస్తున్నవ్ పార్టీకి చెడ్డపేరొస్తున్నదంటే ఆమెపై పగపట్టిండు.. మోఖా కోసం చూసి బీజేపీ పార్టీవాళ్లకు ఉప్పందించిండు. మీనాక్ష నటరాజన్ నామినేషన్ కూడా ఎగురగొట్టిర్రు. ఆమె మీద దొంగ కేసు పెట్టి.. నామినేషన్ ఎగరగొట్టేట్లు చేసిండు. సొంతపార్టీ వాళ్లకే న్యాయం చేయనోడు రాష్ట్రానికి న్యాయం చేస్తడా అని కేటీఆర్ ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..