
హైదరాబాద్, 09 మే (హి.స.)
మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్(TCS) కేసులో నిదాఖాన్ అరెస్ట్ వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర వెనుక ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (MP Asaduddin Owaisi), మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. వీరిద్దరినీ వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దేశ భద్రతకు సంబంధించిన ఇలాంటి అంశాల్లో కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)కి రాజాసింగ్ కీలక సూచన చేశారు. ఒవైసీ సోదరులకు రేవంత్ రెడ్డి దూరంగా ఉండాలని, లేనిపక్షంలో ఆయన రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. అలాగే, బీజేపీ నేతలు ఎవరూ కూడా ఒవైసీని రహస్యంగా కలవకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..