
కర్నూలు, 09 మే (హి.స.)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో ఇవాళ వర్షాలు పడనున్నాయి. ద్రోణి ప్రభావంతో మంగళవారం వరకు మేఘావృతమైన వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు ప్రఖర్ జైన్. పిడుగుపాటు సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. అటు పోలవరం, అల్లూరి, ఏలూరులోని కొన్ని మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV