
న్యూఢిల్లీ, 10 జూన్ (హి.స.)
భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఇరాన్ యుద్ధంలో స్టార్లింక్ టెర్మినల్స్ వాడకంపై వెలువడిన నివేదికల నేపథ్యంలో, భారత హోం శాఖ పరిధిలోని భద్రతా సంస్థలు స్టార్ంక్ ప్రయోగానికి అవసరమైన తుది అనుమతులను హోల్డ్లో పెట్టేశాయి. ఇరాన్లో స్టార్లంక్కు ఎలాంటి అధికారిక లైసెన్స్ లేకపోయినా, పశ్చిమాసియా యుద్ధ సమయంలో ఈ సేవలను వాడటం మన కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. భవిష్యత్తులో ఏదైనా అంతర్జాతీయ ఉద్రిక్తతలు వచ్చినప్పుడు అమెరికా యాజమాన్యంలో ఉన్న ఒక విదేశీ నెట్వర్క్ న్ను మన దేశం ఎలా కంట్రోల్ చేయగలదనే భయం భారత అధికారుల్లో పెరిగింది. దీనివల్ల స్టార్ లింక్ దాదాపు ఏడాది క్రితమే 'గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్' లైసెన్స్ సాధించి, ముంబైలో ఒక మెయిన్ హబ్తో పాటు 10 గేట్వేలను సిద్ధం చేసుకున్నప్పటికీ.. జాతీయ భద్రతకు సంబంధించిన అన్ని అంశాలపై స్పష్టత వచ్చే వరకు సేవలకు అనుమతి ఇవ్వబోమని కేంద్రం తేల్చిచెప్పినట్లు సమాచారం.
చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా జూన్ 12న నాస్డాక్ మార్కెట్లో లిస్టింగ్కు స్పేస్ఎక్స్ సిద్ధమవుతున్న తరుణంలో.. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ భారత్ ఇలా హ్యాండ్ ఇవ్వడం మస్కు గట్టి ఎదురుదెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిఘా కేవలం స్టార్ంక్కే పరిమితం కాలేదు, యూరోపియన్ కంపెనీలతో భాగస్వామ్యాలు ఉన్న ముఖేష్ అంబానీకి చెందిన 'జియో', సునీల్ మిట్టల్కు చెందిన 'భారతీ ఎయిర్టెల్' శాటిలైట్ విభాగాలు కూడా భారత అధికారుల నుంచి తీవ్ర స్క్రూటీనిని ఎదుర్కొంటున్నాయి. డేటా భద్రత, స్థానిక స్టోరేజ్, అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ నియంత్రణ వంటి అంశాలపై పూర్తి హామీలు లభించే వరకు భారత్ శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో ఎలాంటి రాజీకి సిద్ధంగా లేదని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు