బంగారం ప్రియులకు గుడ్ న్యూస్... భారీగా పడిపోయిన ధర
హైదరాబాద్, 10 జూన్ (హి.స.) బంగారం ప్రియులకు భారీ గుడ్ న్యూస్. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒకేసారి భారీగా పతనం కావడం కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్ గా మారింది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ స్థాయిలో ధర
Gold rate


హైదరాబాద్, 10 జూన్ (హి.స.)

బంగారం ప్రియులకు భారీ గుడ్

న్యూస్. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒకేసారి భారీగా పతనం కావడం కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్ గా మారింది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ స్థాయిలో ధరలు దిగిరావడం ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఒక సువర్ణావకాశం అనే చెప్పాలి. బుధవారం ఉదయం హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ. 4,300 మేర క్షీణించి రూ. 1,48,860 కి చేరుకుంది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 3,950 తగ్గి, ప్రస్తుతం 10 గ్రాములు రూ. 1,36,450 పలుకుతోంది. బంగారం ధరలతో పాటే వెండి కూడా భారీగా పడిపోయింది.

కేజీ వెండి ధరపై ఒకేరోజు ఏకంగా రూ. 10,000 మార్కెట్ విలువ తగ్గడంతో, ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 2,60,000 కి పరిమితమైంది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి కారణాల వల్ల దేశీయంగా బులియన్ మార్కెట్పై ఈ ప్రభావం పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande