ప్రమాదవశాత్తు పేలిన గ్రెనేడ్.. ఇద్దరు భారత జవాన్లు దుర్మరణం..!
జమ్మూ కాశ్మీర్, 10 జూన్ (హి.స.) ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలిన ఘటనలో ఇద్దరు భారత జవాన్లు దుర్మరణం పాలయ్యారు. జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్లోగల కమాల్కోట్ సైనిక శిబిరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అధికారిక వర్గాల కథనం ప్రకారం.. శిబిర
Granite


జమ్మూ కాశ్మీర్, 10 జూన్ (హి.స.)

ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలిన

ఘటనలో ఇద్దరు భారత జవాన్లు దుర్మరణం పాలయ్యారు. జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్లోగల కమాల్కోట్ సైనిక శిబిరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అధికారిక వర్గాల కథనం ప్రకారం.. శిబిరంలోని సైనికులు ఆయుధ పరికరాలను ఒకరి నుంచి మరొకరికి అప్పగిస్తున్న సమయంలో గ్రెనేడ్ అకస్మాత్తుగా పేలింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే సైన్యానికి చెందిన 92 బేస్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ఘటన పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిందని, ఇందులో ఉగ్రవాదుల ప్రమేయం కానీ, ఇతర బాహ్య శక్తుల పాత్రకానీ లేదని రక్షణ శాఖ వర్గాలు స్పష్టంచేశాయి. ఈ దురదృష్టకర సంఘటనపై సైన్యం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. సాధారణంగా ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా జరుగుతాయని, ఆయుధాల వినియోగంలో అప్రమత్తత ఎంతటి కీలకమో ఈ ఉదంతం గుర్తుచేస్తోందని అధికారులు పేర్కొన్నారు. మృతి చెందిన సైనికుల కుటుంబాలకు ఆర్మీ ఉన్నతాధికారులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

నిబంధనల ప్రకారం బాధిత కుటుంబాలకు అందాల్సిన అన్ని రకాల ఆర్థిక సాయాన్ని, ఇతర ప్రయోజనాలను సత్వరమే అందేలాm చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా రక్షణ శాఖ అధికారులు హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande